బాల్‌బాయ్‌పై టెన్నిస్ స్టార్ ఆగ్రహం!

కలం, స్పోర్ట్స్​ : షాంఘై మాస్టర్స్‌లో బాల్ బాయ్‌పై దురుసుగా ప్రవర్తించిన రాఫెల్ జోదార్‌ (Rafael Jodar)పై కోచ్ బ్రాడ్ గిల్బర్ట్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. టెన్నిస్ కోర్టులో స్పెయిన్ యంగ్ ప్లేయర్ రాఫెల్ జోదార్ చేసిన రచ్చ ఇప్పుడు కలకలం రేపుతోంది. షాంఘై మాస్టర్స్ టోర్నీలో బాల్ బాయ్‌పై అతడు చూపిన అహంకారంపై క్రీడా ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మ్యాచ్ ఒత్తిడిలో జోదార్ హద్దులు మీరాడు. టవల్ సరిగా ఇవ్వలేదనే నెపంతో ఒక చిన్నారి బాల్ బాయ్‌పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనను అంపైర్ తీవ్రంగా పరిగణించి కోడ్ వయోలేషన్ వార్నింగ్ ఇచ్చారు.

నెటిజన్లు కూడా జోదార్ తీరుపై సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. దీనిపై స్టార్ కోచ్ బ్రాడ్ గిల్బర్ట్ నిప్పులు చెరిగారు. “కోర్టులో ఏం జరిగినా సహించవచ్చు కానీ, అమాయక బాల్ బాయ్స్‌పై కోపం చూపడం క్షమించరాని నేరం” అని ఘాటుగా హెచ్చరించారు. ఈ వీడియోను పదే పదే చూసి జోదార్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. జోదార్‌కి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కావు. గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో బాల్ గర్ల్‌ను తోసేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

మరొక మ్యాచ్‌లో తనతో కలిసి నడిచే చిన్నారిని అస్సలు పట్టించుకోకుండా అవమానించాడు. చౌకబారు ప్రవర్తనపై తీవ్ర దుమారం రేగడంతో జోదార్ ఎట్టకేలకు దిగొచ్చాడు. తాను చేసింది పెద్ద తప్పేనని, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయానని క్షమాపణలు చెప్పాడు. బాల్ బాయ్స్, అంపైర్ల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>