కలం, వనపర్తి: దసరా పండుగను పురస్కరించుకొని కల్వరాల (Kalvarala) గ్రామంలో గురువారం కీర్తి శేషులు మర్రి సరోజమ్మ స్మారక లోకల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏడు జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో లవ్లీ టీం ప్రథమ బహుమతి, సీనియర్స్ టీం ద్వితీయ బహుమతి సాధించాయి. ప్రథమ బహుమతిగా రూ.6 వేల నగదు, షీల్డ్‌ను, ద్వితీయ బహుమతిగా రూ.4 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. ఈ బహుమతులను మర్రి సరోజమ్మ కుమారుడు మర్రి ప్రకాష్‌రెడ్డి స్పాన్సర్ చేశారు.
సీనియర్స్ టీంలో పలువురు ప్రభుత్వ సీనియర్ ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్ కమిషనర్ డి. మహేశ్వర్‌రెడ్డి పాల్గొనడం విశేషం. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు రాముడు, వార్డు సభ్యులు, నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చక్ర వెంకటేష్, వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, ఉపాధ్యాయులు శివశంకర్, సాయి, ఈశ్వర్, రమేష్, దర్గయ్య, కిరణ్, నరసింహ, రాజయ్య, దిలీప్ కుమార్‌రెడ్డి, దయాకర్, అంజి తదితరులు పాల్గొన్నారు.

