Mobile Popup Ad
Mobile Popup Ad

హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం

కలం, సినిమా డెస్క్: బాలీవుడ్ లో అడుగుపెట్టి హాలీవుడ్ వరకు సత్తా చాటిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) అరుదైన గౌరవాన్ని అందుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా’ నుంచి ‘గ్లోబల్ వాన్గార్డ్’ గౌరవానికి ఎంపికైంది. ఆమె సినీ ప్రస్థానంలో ఆసియన్ పసిఫిక్, వెస్ట్రన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీల మధ్య వారధిలా పనిచేశారని, అందుకే ‘గ్లోబల్ వాన్ గార్డ్’ తో సత్కరిస్తున్నట్లు గోల్డ్ గాలా సంస్థ ప్రకటించింది.

9న అమెరికాలో వేడుక..

గోల్డ్ గాలా సంస్థ అయిదేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ సారి వేడుకలను అమెరికా లాస్ ఏంజెల్స్ లో మే 9న ‘ఏ న్యూ వరల్డ్ గోల్డ్’ థీమ్ తో జరగనున్నాయి. ఈ వేడుకల్లోనే ప్రియాంక చోప్రాకు ‘గ్లోబల్ వాన్ గార్డ్’ గౌరవం దక్కనుంది. ఈ గౌరవం అందుకుంటున్న ఏకైక భారతీయ నటి ప్రియాంకనే కావడం విశేషం. ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్ గా నటిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>