“ఇడుపుకాయితం” రిలీజ్ డేట్ ఫిక్స్‌!

క‌లం, సినిమా: టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ర‌చ్చ లేపిన “ఇడుపుకాయితం” (Idupu Kayitham) మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేశారు. డిసెంబ‌ర్ 11న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో విభిన్న క‌థ‌ల‌తో అల‌రించే ప్రియద‌ర్శి హీరోగా, ఫోక్ సాంగ్స్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. వంశీరెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌, బ‌న్నీ వాస్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు.

ఇడుపుకాయితం సినిమా షూటింగ్ పూర్త‌యిపోయిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో, ఫ్యామిలీ ఎమోష‌న్స్ బ్యాక్‌డ్రాప్‌గా తెర‌కెక్కుతోంది. టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోనే ఈ సినిమా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది. స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ యాస నుంచి పుట్టుకొచ్చిన ప‌దం ఇడుపుకాయితం చుట్టూ పెద్ద చ‌ర్చే న‌డిచింది. ఇక ప్రియ‌ద‌ర్శి ఎంచుకునే క‌థ‌ల నేప‌థ్యం, బ‌న్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నాయి. ఇడుపుకాయితం ఏమేర‌కు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>