ఇద్దరు దిగ్గజాలకు షాక్.. అనాహత్ సింగ్ సంచలనం!

కలం, స్పోర్ట్స్: భారత స్క్వాష్ యువతార అనాహత్ సింగ్ (Anahat Singh) చరిత్ర సృష్టించింది. అమెరికాలో జరుగుతున్న సిలికాన్ వ్యాలీ ఓపెన్‌ (Silicon Valley Open) లో తొలిసారి పీఎస్ఏ గోల్డ్ సెమీఫైనల్‌కు చేరింది. ప్రపంచ 14వ ర్యాంకర్‌ సల్మా హానీని ఐదు గేమ్‌ల పోరులో ఓడించింది. రెండుసార్లు వెనుకబడినా పుంజుకుని 4-11, 11-8, 4-11, 11-2, 11-5తో విజయం సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. 18 ఏళ్ల అనాహత్ ఈ మ్యాచ్‌లో ఆరంభంలో తడబడింది. తొలి గేమ్‌ను 4-11తో కోల్పోయింది. రెండో గేమ్‌లో పుంజుకుని స్కోరును సమం చేసింది. మూడో గేమ్‌లో మళ్లీ ఓటమి ఎదురైంది.

అయితే, చివరి రెండు గేమ్‌లలో అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థికి కేవలం ఏడు పాయింట్లే ఇచ్చి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై అనాహత్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యర్థితో గతంలో ఆడలేదని, ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోటీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపింది. ఆరంభం సరిగా లేకపోయినా చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. సెమీఫైనల్‌కు ముందు రోజు కూడా అనాహత్ సంచలన విజయం సాధించింది.

ఎనిమిదిసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈజిప్ట్ క్రీడాకారిణి నూర్ ఎల్ షెర్బినీని వరుసగా మూడు గేమ్‌లలో ఓడించింది. 11-8, 11-8, 11-7తో కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఇప్పుడు ఫైనల్ బెర్తు కోసం అనాహత్ మలేషియాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ సివసంగరి సుబ్రమణియంతో తలపడనుంది. ఇటీవల జరిగిన 2026 ఆసియా క్రీడల ఫైనల్‌లో అనాహత్‌ను సివసంగరి ఓడించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>