కలం, వెబ్ డెస్క్ : దుర్గాపూజ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) శుభాకాంక్షలు తెలిపారు. దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. దుర్గాపూజ భారత దేశ గొప్ప వారసత్వానికి ప్రతీక అని వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గా పూజ నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
ఇతరుల సంక్షేమం కోసం కృషి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారని రాష్ట్రపతి (President Droupadi Murmu) తెలిపారు. ఈ పర్వదినం భారతీయులందరినీ ఐక్యం చేయడంతో పాటు దేశ సంప్రదాయాలు, జీవనశైలి, కళలు, సంస్కృతిని చాటిచెబుతుందన్నారు. మహిళల శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయంలో భాగమని రాష్ట్రపతి పేర్కొన్నారు. దుర్గా మాతపై నిజమైన భక్తిని చాటుకోవాలంటే మహిళలకు అన్ని విధాలుగా గౌరవం ఇవ్వాలని ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.

