శివగంగ ఆలయ కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా క్రిస్టా

కలం, వెబ్‌డెస్క్: ఆలయ కోనేరులోకి ఇన్నోవా క్రిస్టా కారు దూసుకెళ్లి నీటిలో మునిగిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వర దేవాలయం కోనేరు (Shivaganga Temple Pond) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి నేరుగా కోనేరులోకి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నీటిలోకి వెళ్లగానే వెంటనే డోరు తెరిచి బయటకు రావడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు.

కారులో డ్రైవర్ తప్ప మరెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు అతివేగమే కారణమై ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కారు అదుపుతప్పి కోనేరులోకి ఎలా దూసుకెళ్లిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆలయ పరిసరాల్లో వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>