కలం, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ లలో హెచ్చుతగ్గులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. మదుపర్లు వాటాల విక్రయం, స్టాక్ మార్కెట్‌లో అధిక ద్రవ్యలభ్యత ఉండటం వల్ల లాభాల స్వీకరణ తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు థాయ్‌లాండ్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడులు వంటి అంశాలను ప్రస్తావించారు.
అమెరికా విధిస్తున్న సుంకాలు, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ఎకానమీ వృద్ధి మెరుగ్గా ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత స్టాక్ మార్కెట్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. ప్రధాన సూచీలు దాదాపు 12 శాతం తగ్గుముఖం పట్టాయని వివరించారు. విదేశీ మదుపర్లు భారతీయ ఈక్విటీల నుంచి పెట్టుబడులను విత్ డ్రా చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్‌పై ఎఫెక్ట్ అవుతున్నాయని తెలిపారు.

