ఇందిరమ్మ ఇండ్లకు టెక్నికల్ చిక్కులు.. మంత్రి పొంగులేటి రివ్యూ

కలం, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ (Indiramma Housing Scheme) ప్రోగ్రెస్‌పై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) రివ్యూ చేస్తున్నారు. జిల్లాలవారీగా జరుగుతున్న పనులపై కలెక్టర్లు, డిపార్టుమెంటు అధికారుల నుంచి ఆరా తీస్తున్నారు. నిర్దేశిత షెడ్యూలు ప్రకారం పనులు జరగడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రి సూచనలు ఇస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను పొరపాటున నమోదు చేస్తే వాటిని సరిదిద్దే టెక్నికల్ వెసులుబాటు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. వీటిపైనా మంత్రి, అధికారులు లోతుగా దృష్టి సారించారు. జిల్లాలవారీగా ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రెస్‌పై రివ్యూలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సోమవారం ఉదయం మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ జిల్లాకు చెందిన అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు హాజరై క్షేత్రస్థాయి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళానున్నారు. సంబంధిత అధికారులకు మంత్రి అక్కడికక్కడే సూచనలు ఇవ్వనున్నారు.

టెక్నికల్ సమస్యలతో స్కీమ్ ప్రోగ్రెస్‌పై ఎఫెక్ట్ :

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక మొదలు నిధుల విడుదల వరకు అనుసరించే గైడ్‌లైన్స్, దానికి తగినట్లుగా రూపొందిన సాఫ్ట్‌వేర్ సపోర్టు చేయకపోవడం ఇబ్బందికరంగా మారింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడున్నర వేల చొప్పున రాష్ట్రంలో మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారుల ఎంపిక, దశలవారీగా నిధుల విడుదల కొనసాగుతూ ఉన్నది. కొన్ని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నిచోట్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ప్రజలు వారి ఆధార్ కార్డు వివరాలు సహా పత్రాలను సమర్పిస్తున్నారు. వాటి పరిశీలన తర్వాత అర్హతలున్నట్లు నిర్ధారణ అయితే ఉన్నట్లు అధికారులు లబ్ధిదారుల జాబితాలో చేరుస్తున్నారు. ఈ పత్రాల ఆధారంగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్లు పొరపాటున ఆధార్ నెంబర్‌ను తప్పుగా నమోదు చేస్తే మిస్‌మ్యాచ్ కారణంతో నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడుతూ ఉన్నది. తప్పుగా నమోదు చేసిన అంకెను సరిదిద్దడానికి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న టెక్నికల్ చిక్కులు లబ్ధిదారులకు సంకటంగా మారింది. ఇప్పుడు ఇది సమస్యాత్మకంగా మారింది. సాఫ్ట్‌వేర్ టెక్నికల్ అంశాల దిద్దుబాటుపైనే కసరత్తు జరుగుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>