అభివృద్ధికి చిరునామాగా లద్ధాఖ్‌: ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక లద్ధాఖ్ రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయని.. అభివృద్ధికి చిరుమానాగా నిలుస్తోందని ప్రధాని మోదీ (PM Modi)  అన్నారు. సుమారు 3,350 కోట్ల అభివృద్ధి పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసి ప్రసంగించారు. విద్యుత్తు, నీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతుల కల్పనతో లద్ధాఖ్ ప్రజల జీవనం మరింత సులభతరమవుతోందన్నారు. ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పాత్ర ఎంతో ఉందన్నారు. లేహ్ ఎయిర్‌పోర్టులో రూ.650 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మించామని.. తద్వారా ప్రతి ఏడాది ప్రయాణికుల సంఖ్య పది లక్షల నుంచి 35 లక్షలకు పెరిగిందన్నారు. అలాగే, విమానాల రాకపోకలు మూడింతలు పెరిగాయన్నారు. భవిష్యత్తులో మరో టెర్మినల్ కూడా అక్కడ రాబోతుందన్నారు.

వాతావరణమే అతి పెద్ద సవాల్..

లద్ధాఖ్ రాష్ట్రంలో నిరంతరం మారే వాతావరణమే అతి పెద్ద సవాల్ అని ప్రధాని మోదీ అన్నారు. వాటిని అధిగమించి మరీ తమ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందన్నారు. 2019 కంటే ముందు అక్కడ 1,800 కిలోమీటర్ల రోడ్లు ఉంటే.. ఇప్పుడు వాటి విస్తీర్ణం 4 వేల కిలోమీటర్లకు పెరిగిందన్నారు. 19 వంతెనలు కాస్తా 75 బ్రిడ్జిలకు పెరిగాయన్నారు. ఒకప్పుడు ఏడు హెలిప్యాడ్‌లు ఉంటే.. ఇప్పుడు లద్ధాఖ్ రాష్ట్రంలో 40 హెలిప్యాడ్లు ఏర్పాటైనట్లు వివరించారు. 99 శాతం నివాసాలకు మంచి నీరు అందుతుండటం గొప్ప విషయమన్నారు. జోజిలా సొరంగం వంటి వ్యూహాత్మక నిర్మాణాల పనులు కూడా వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>