బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన బీఆర్ఎస్ నాయకురాళ్లు

కలం, అశ్వారావుపేట: పూల సిరుల పండుగ.. అచ్చమైన తెలుగు ఆడపడుచుల సంబరం బతుకమ్మ వేడుకలు పల్లెల్లో వైభవంగా సాగాయి. ఈ పండుగ శోభను ఇనుమడింపజేస్తూ, బీఆర్ఎస్ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ ఉదయజ్యోతి అశ్వారావుపేట (Aswaraopeta) మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న వారు, మహిళలతో కలిసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా  తిరుమలకుంట పంచాయతీ పరిధిలోని తిరుమలకుంట, పాకలగూడెం, తొగ్గూడెం గ్రామాలతో పాటు రెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని బండారుగుంపు, పెద్దరెడ్డిగూడెం గ్రామాలను వారు సందర్శించారు. అక్కడ గ్రామస్థుల మధ్య ఉత్సాహంగా గడుపుతూ, మహిళలతో కలిసి ఆత్మీయంగా బతుకమ్మ ఆడారు.

వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి, సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను ఈ సందర్భంగా వారు అభినందించారు. బతుకమ్మలను వేడుకలకు తీసుకొచ్చిన మహిళలకు ఆడపడుచుల కానుకగా ప్రత్యేక బహుమతులను అందజేశారు. మహిళలతో ఆత్మీయంగా మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, వారి పండుగ ఆనందంలో పూర్తిగా భాగస్వాములయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>