Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగాదికే వస్తున్న ఉస్తాద్.. రిలీజ్ డేట్‌లో మార్పు!

క‌లం, వెబ్ డెస్క్‌: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్‌ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) రిలీజ్‌ డేట్ వచ్చేసింది. గతంలో మూవీని మార్చి 26న విడుద‌ల చేస్తామ‌ని టీం ప్ర‌క‌టించినా ఇంకాస్త ముందుగానే విడుద‌ల చేస్తున్న‌ట్లు చెప్పేసింది. మార్చి 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించింది. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ కొత్త పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో హీరోయిన్ రాశీఖ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్‌కు గ‌బ్బ‌ర్ సింగ్‌తో హిట్ ఇచ్చిన హ‌రీశ్ ఈసారి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తాడో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>