కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతుంది. ‘ఎన్టీఆర్- నీల్’ (NTRNeel) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతుంది. కానీ ఇంతవరకు మూవీ టీం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. గతంలో చిత్ర యూనిట్ ఈ సినిమాను జూన్ 25, 2026 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ షూటింగ్ డిలే కావడంతో సినిమా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఎన్టీఆర్- నీల్ మూవీని వచ్చే ఏడాది జూన్ 11 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన లుక్ మార్చుకున్నారు. కండలు తిరిగిన బాడీతో ఇటీవల ఎన్టీఆర్ రిలీజ్ చేసిన పిక్ క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది అనుకున్న ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మూవీ టీం గ్లింప్స్ తో స్పెషల్ ట్రీట్ అందించనుంది.

