నేహా బోరాకు అధిక ప్రాధాన్యం.. కాంగ్రెస్‌లో అసంతృప్తి

కలం, నేషనల్ డెస్క్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నిరసనల్లో ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా (Neha Bora)కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 12న జరిగిన సుప్రీంకోర్టు మార్చ్​​​లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెంట నేహా బోరాకు ప్రాధాన్యత కల్పించడం, ప్రెస్ కాన్ఫరెన్స్​​లోనూ మాట్లాడే అవకాశం ఇవ్వడంపై ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థిగా ఉన్న నేహా బోరాకి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎన్‌ఎస్‌యూఐ సమన్వయకర్త అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.

అఖిలేష్ యాదవ్ తమ అధికారిక వాట్సాప్ గ్రూప్ పేరును ‘వీ ద ఛోటూ’ (చిన్న పనులు చేసేవాడు)గా మార్చి నిరసన తెలిపారు. ఈ వివాదం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో రాహుల్ గాంధీ శుక్రవారం ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను విన్నట్లు తెలిసింది. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలు గ్రూప్ పేరును తిరిగి మార్చగా, తమలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆ సంఘం అధ్యక్షుడు వినోద్ జఖర్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>