గ్రాహం యాక్ట్: డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్​ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రష్యా, ఇరాన్ దేశాలపై ఆంక్షలు (Trump Sanctions) విధించేందుకు రూపొందించిన గ్రాహం చట్టం అమలులో సడలింపులు ప్రకటిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ కు రాతపూర్వక నివేదిక

గ్రాహం చట్టంలోని సెక్షన్ 115 అధ్యక్షుడు ప్రతిపాదించిన మినహాయింపులకు పూర్తి అధికారాన్ని కల్పిస్తుంది. విదేశీ వ్యక్తులు, సంస్థలపై ఉన్న విధులు, ఆంక్షల నుంచి ఉపశమనం కలిగిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ అమెరికా కాంగ్రెస్‌ కు అధికారిక పత్రాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు.

గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం

రష్యా, ఇరాన్‌పై ఆంక్షలు సడలించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు కొత్త రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయం వైట్ హౌస్ వ్యూహాత్మక మార్పులకు అద్దం పడుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>