కేసుల దర్యాప్తుపై ఎస్పీ జానకి షర్మిల కీలక ఆదేశాలు

కలం, నిర్మల్ : గ్రేవ్, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్షలు పడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP) అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, కేసుల పురోగతిని సమీక్షించారు. కార్యాలయంలోని రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.

దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ కేసులు, కోర్టు విచారణ దశలో ఉన్న కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను సమీక్షించారు. ప్రతి కేసులో నిర్దేశిత ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌ఓపీ) పాటిస్తూ, శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

రౌడీషీటర్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి. శ్రీనివాస్, సీఐలు గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, సత్యనారాయణ, కృష్ణ, ఎస్సై లింబాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>