కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న దసరా (Nirmal Dasara) ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు నిర్వాహకులు అందజేశారు. విశ్వహిందూ పరిషత్, శ్రీ ఆంజనేయ గణేష్ మండలి, మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో దసరా వేడుకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శమీ పూజతో పాటు రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలకు హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.

