కొంప ముంచిన దసరా విందు!

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం తండా (Annaram Thanda)లో మటన్ తిని నలుగురు పిల్లలతో సహా సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. తండా వాసులు దసర పండుగ మేక కోసి విందు చేసుకున్నారు. ఈ విందులో బంధువులు పాల్గొన్నారు. నిన్న కోసిన మటన్ నిన్న ఇవ్వాళ తిన్నారు. ఇవ్వాళ మటన్ తిన్న తర్వాత వాంతులు విరేచనాలు అయ్యాయి. వెంటనే పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం సుమారు 30 మందిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రవీందర్ రెడ్డి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>