కలం, జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో వివిధ పోస్టులకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఔట్సోర్సింగ్ (Gadwal Outsourcing) విధానంలో మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసేందుకు ఈనెల 16న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని గంజిపేటలో ఉన్న శ్రీ సత్య సాయి డిగ్రీ పీజీ కళాశాలలో ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మధ్యాహ్నము ఒంటి గంట నుంచి ఒకటిన్నర గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
ఆఫీస్ సబార్డినేట్, రేడియో గ్రాఫర్ టెక్నీషియన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అనస్థీషియా టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సాయంత్రం ఐదు గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రంలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. తమ వెంట దరఖాస్తు రసీదుపై పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించుకొని రావాలని, ఆధార్ కార్డును కూడా తీసుకురావాల్సిందిగా పేర్కొన్నారు.

