కలం, సినిమా : నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. “The wait has a time… The impact has no limit” అంటూ మేకర్స్ ఇచ్చిన హింట్‌తో ‘NBK111’పై అంచనాలు మరింత పెరిగాయి. రేపు సాయంత్రం 5:40 గంటలకు ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ రానుంది. “Entry of an Era” అంటూ ప్రకటించడంతో, ఇది సాధారణ అనౌన్స్‌మెంట్ కాదని స్పష్టమవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
“గాడ్ ఆఫ్ మాసెస్”గా పేరు పొందిన బాలయ్య తన స్టైల్‌కు తగ్గట్టుగా మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం ఈ సినిమాకు మరింత పవర్‌ను తీసుకురానుంది.

