చర్మం జిడ్డుగా మారుతుందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

కలం, వెబ్‌డెస్క్: జిడ్డు చర్మం (Oily Skin) అనేది చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ చర్మ సమస్య. ముఖంపై ఉండే సెబేషియస్ గ్రంథులు (Sebaceous glands) అవసరానికి కంటే ఎక్కువ ‘సెబమ్’ అనే నూనెను ఉత్పత్తి చేయడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారికి చర్మం జిడ్డుగా మారడమే కాదు మొటిమలు, మచ్చలు.. వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఈక్రమంలో ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు (Skincare Tips) నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

  • బాదం పొడిలో తేనే కలిపిన మిశ్రమాన్ని స్క్రబ్ చేయడం ద్వారా జిడ్డుచర్మ సమస్యను తగ్గించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇంకా రెండు చెంచాల ఓట్స్ పొడిని, కలబంద గుజ్జుతో మిక్స్ చేసి ఈ మిశ్రమంతో కొద్ది నిమిషాల పాటు ముఖానికి మర్దన చేసి, చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇది కూడా సహజంగానే చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
  • ఇలా నీట్‌గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. గుడ్డు తెల్లసొనలో ఒక చెంచా తేనె, శెనగపిండి కలిపి సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్‌ను ముఖానికి పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకుంటే జిడ్డు తనాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
జిడ్డు చర్మాన్ని దూరం చేసే సింపుల్ టిప్స్
  • ఆయిలీ స్కిన్ ఉన్నవారు మేకప్ వేసుకునేటప్పుడు లిక్విడ్ ఐటమ్స్‌ను ఎక్కువగా ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం.
  • రోజూ ఉపయోగించే సబ్బులు లేదా లిక్విడ్లు కూడా ఆయిల్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆయిల్‌ను గ్రహించే ఫేస్ మాస్క్, ఫేస్ ప్యాక్స్ రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉండాలి.
  • పోషకాహారం తీసుకుంటూ నూనె ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం వల్ల హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించాలని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>