‘ఇరుముడి’ నుంచి బిగ్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

కలం, సినిమా : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)  నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి'(Irumudi) మరోసారి ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌తో పాటు, “The Heart of Irumudi” గ్లింప్స్‌ను జూన్ 3, 2026న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్టర్‌లో రవితేజ చిన్నారి నక్షత్రతో కనిపించడం విశేషం.

టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ ‘కావేరి’ పాత్రలో నటిస్తుండగా, సాయి కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్షేషన్ జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్  అందిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది ఆగష్టులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>