కలం, వెబ్ డెస్క్ : నంద్యాల (Nandyal) జిల్లా ఆత్మకూరులో స్థానిక సంస్థల ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి నివాసంలో పోలీసులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అధికారులకు ఏకంగా రూ.42.20 లక్షల నగదు లభించింది. స్వాధీనం చేసుకున్న భారీ మొత్తానికి సంబంధించిన ఎలాంటి సరైన ఆధారాలు, రశీదులు చూపించకపోవడంతో అధికారులు ఆ రూ.42.20 లక్షలను తక్షణమే సీజ్ చేశారు.
కోడ్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక తయారు చేసి ఎన్నికల సంఘానికి అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుండి వచ్చింది, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏమైనా తీసుకువచ్చారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

