అనిరుధ్ ఆ పార్టీకే ఓటేశాడ‌ట‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ (Tamil Nadu Elections )పోలింగ్ కొన‌సాగుతోంది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌మ‌ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ర‌జినీకాంత్‌, ఆయ‌న కుమార్తె సౌంద‌ర్య‌, క‌మ‌ల్ హాస‌న్‌, శృతి హాస‌న్‌, అజిత్‌, ఖుష్బు, త్రిష, విజ‌య్‌, స్టాలిన్‌, ఉద‌య‌నిధి స్టాలిన్‌, శ‌శిక‌ళ, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌ (Anirudh) త‌దిత‌రులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వీరంతా పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే వీరంద‌రిలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ హాట్ టాపిక్‌గా మారాడు.

అనిరుధ్ (Anirudh) వేసుకొచ్చిన డ్రెస్ ఆధారంగా ఆయ‌న ఆ పార్టీకే ఓటేశాడంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. అనిరుధ్ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు ఎల్లో క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకొని వ‌చ్చాడు. విజ‌య్ పార్టీ టీవీకే జెండాలో ఎల్లో, రెడ్ క‌ల‌ర్స్ ప్ర‌ధానంగా ఉంటాయి. దీంతో అనిరుధ్ విజ‌య్ పార్టీకే ఓటేశాడ‌ని పేర్కొంటూ నెటిజ‌న్లు వీడియోను వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఏ పార్టీకి ఓటేశాడ‌న్న దానిపై అనిరుధ్ మాత్రం బ‌హిరంగంగా వెల్ల‌డించ‌లేదు. కొంద‌రు విజ‌య్ కూడా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచే కాబ‌ట్టి సినిమా వాళ్లంతా విజ‌య్‌కే ఓటు వేస్తార‌ని కామెంట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ష‌ర్ట్ ఆధారంగా విజ‌య్‌కే ఓటు వేశాడ‌ని ఎలా నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి అనిరుధ్ (Anirudh) ఏ పార్టీకి ఓటు వేశాడో ఆయ‌న‌కే తెలియాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>