Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీ హైకోర్ట్‌కు అల్లు అర్జున్.. ఎందుకంటే?

క‌లం, వెబ్ డెస్క్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌స్తుతం ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన రాకా ఫస్ట్ లుక్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. త‌న పేరు, ఫోటోలు, వాయిస్‌ను కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నార‌ని బ‌న్నీ ఢిల్లీ హైకోర్ట్‌ (Delhi High Court)ను ఆశ్ర‌యించారు. త‌న ఫోటోలతో కొన్ని ఉత్ప‌త్తులు అమ్ములు కొంద‌రు సొమ్ము చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. త‌న అనుమ‌తి లేకుండా జ‌రుగుతున్న వ్య‌వ‌హారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ కేసు శుక్ర‌వారం విచార‌ణ‌కు రానుంది. గతంలో స‌ల్మాన్ ఖాన్ స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఇలాగే త‌మ ఐడెంటిటీ దుర్వినియోగం అవుతోంద‌ని కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై కోర్టు క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇక బ‌న్నీ కేసుపై ఎలాంటి తీర్పు వ‌స్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>