ఆర్టీసీ బస్సులో షాకింగ్ ఘటన.. కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలి దాడి!

​కలం, ఖమ్మం బ్యూరో : ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆధార్ కార్డు చూపించమన్నందుకు ఓ ఆర్టీసీ కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో కండక్టర్‌ను బస్సు బయటకు నెట్టివేయడంతో ఆమె బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (Aswapuram RTC Incident) మండల పరిధిలోని మిట్టగూడెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

​అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాల్ని ఉచిత ప్రయాణ పథకం కింద కండక్టర్ ఆధార్ కార్డు చూపించాలని కోరారు. అయితే ఆమె వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో, నిబంధనల ప్రకారం టికెట్ ఛార్జీలు చెల్లించాలని సూచించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను ఒక్కసారిగా బస్సు బయటకు నెట్టివేసింది. ఈ ప్రమాదంలో కండక్టర్ బస్సు వెనుక టైర్ల కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ​సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, తోటి సిబ్బంది స్పందించి క్షతగాత్రురాలైన కండక్టర్‌ను వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>