కలం, వలిగొండ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రజా పాలన లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil Kumar Reddy) అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని దేవీశ్రీ గార్డెన్స్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందజేసిందని ఆయన (MLA Kumbham ) అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గరిసె రవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహాదేవ్, మత్స్యగిరి గుట్ట చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

