దేవాదాయ శాఖ స్థలంలో దాండియా నైట్స్‌.. అనుమతులు మాత్రం లేవు..!

కలం, నిర్మల్: దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో దాండియా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. పింజారిగుట్ట ఉదాసి మఠానికి చెందిన స్థలం ప్రియదర్శిని నగర్‌లోని ఎన్టీఆర్‌ మార్గులో ఉంది. ఈ స్థలంలో అన్‌శ్రుత రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో ‘నిర్మల్‌ దాండియా నైట్స్‌ 2026’ (Nirmal Dandiya Nights) పేరుతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు తీసుకోకుండానే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది.

అనుమతులు లేకుండానే దేవాదాయ శాఖ ఆస్తుల వినియోగం..!

దేవాదాయ శాఖకు చెందిన స్థలాలను వినియోగించాలంటే సంబంధిత నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాంటిది ముందస్తు అనుమతులు లేకుండానే వేడుకలకు ఏర్పాట్లు చేపట్టడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వేడుకల ప్రచారం జోరుగా సాగుతుండగా, మరోవైపు అనుమతులు లేవని ఈవో స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిర్వహులపై చర్యలు తీసుకుంటాం: ఇంచార్జి ఈవో భూమయ్య.

దేవాదాయ శాఖ స్థలంలో దాండియా వేడుకల (Nirmal Dandiya Nights)  కు ఏర్పాట్లు చేస్తున్న విషయంపై ఇంచార్జి ఈవో భూమయ్యను సంప్రదించగా, ఈ కార్యక్రమాల నిర్వహణకు దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>