అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి : రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఆహార భద్రతతో పాటు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణంలోని ఫేమస్ గార్డెన్స్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీబీనగర్ పట్టణం, మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు (Smart Ration Cards) అందించడం ద్వారా వారికి ఆహార భద్రత కల్పించడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులు, ఇతర ప్రయోజనాలు పారదర్శకంగా, సక్రమంగా చేరేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సొంత ఇల్లు లేని నిరుపేదల ఆవేదనను గుర్తించిన ప్రభుత్వం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రాధాన్యతతో అమలు చేస్తోందని తెలిపారు.

లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడం ద్వారా వారి కల నెరవేరడానికి మొదటి అడుగు పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ, అర్హులైన చివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పొట్టోల్ల శ్యామ్ గౌడ్, స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్, పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవేందర్, సురకంటి సత్తిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల రామాంజనేయులు, గోలి పింగల్ రెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, ఆగమయ్య గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వాకిటి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు సర్పంచులు, పిఎసిఎస్ డైరెక్టర్లు, నాయకులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>