బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: పొన్నం

కలం, కరీంనగర్ బ్యూరో: గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సచివాలయం నుండి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈజీఎస్‌ (ఉపాధి హామీ) కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అని స్పష్టం చేశారు.
​
ALIMCO ఆధ్వర్యంలో ADIP పథకం కింద అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఒక్క అర్హుడు కూడా మిస్ కాకుండా లబ్ధిదారుల డేటాను ముందే సిద్ధం చేయాలన్నారు. కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఈ రెండు మండలాలకు ఒక రోజు చొప్పున, సిద్దిపేట జిల్లాలో మూడు మండలాలకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్డీఓ, పీడీ, డీడబ్ల్యూఓ, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>