నిర్మల్ మార్కెట్‌ యార్డు ప్రహరీ గోడ కూల్చివేతపై బీజేపీ ఆందోళన

కలం, నిర్మల్‌: నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రహరీ గోడను కూల్చివేసి (Market Yard Wall Demolition) నిర్మాణ పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నాయకులు కూల్చివేసిన ప్రహరీ గోడను పరిశీలించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మార్కెట్‌ యార్డు ప్రహరీ గోడను కూల్చివేసి నిర్మాణాలు చేపడుతున్న వారితోపాటు వారికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.

వెంటనే ఆక్రమణలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కూన శశాంక్‌, శ్రీరామోజు నరేష్‌, గంజి రాజు, రావులవారి విట్టల్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్‌, మెడిసెమ్మరాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, తక్కల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్‌, ఆదుముల్ల గంగన్న, డి.శ్రీనివాస్‌, పొన్నం నారాయణ గౌడ్‌, జుట్టు దినేష్‌, అర్జున్‌, హరీష్‌, ఈశ్వర్‌, వెంకట్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, తిరుపతి, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>