రేపు నిర్మ‌ల్‌కు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు

క‌లం, నిర్మ‌ల్‌: రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) శనివారం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం రాత్రి తెలిపారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడెం ప్రాజెక్టుకు బయలుదేరుతారని పేర్కొన్నారు.

మధ్యాహ్నం 1.35 గంటలకు కడెం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వలు, వరద నిర్వహణ, భద్రతా చర్యలు, అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని, మంత్రుల పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>