సాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు: మంత్రి తుమ్మల

కలం, ​ఖమ్మం బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో సీతారామ ఎత్తిపోతల పథకం సత్తుపల్లి ట్రంకు కెనాల్ పనులను ఆయన పరిశీలించారు.

అనంతరం 10 మంది రైతులకు మంత్రి తుమ్మల భూసేకరణ పరిహార చెక్కులను అందించారు. గోదావరి జలాలను బేతుపల్లి చెరువుకు మళ్లించి వేసవిలో నీటిని నిల్వ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఆయిల్ పామ్ సాగుకు, తాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా దుమ్ముగూడెం వద్ద ఇసుక బస్తాలతో నీటి నిల్వ పనులు ప్రారంభించామని చెప్పారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>