ఆదిలాబాద్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

కలం, ఆదిలాబాద్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా కేంద్రంలో శనివారం 100 సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ స్వయంగా సైకిల్‌ తొక్కుతూ ర్యాలీలో పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లాలోని పలు మండల కేంద్రాల్లోనూ పోలీస్ సిబ్బంది బైక్‌ ర్యాలీలు నిర్వహించారు.

ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజలకు ఎస్పీ వివరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను, వారి కుటుంబాల సేవలను స్మరించుకున్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు అమరవీరుల త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>