విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: జడ్జి శివ నాయక్

కలం, ​భద్రాచలం: గుర్తు తెలియని వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్ వి.శివ నాయక్ (Judge Shiva Naik) తెలిపారు. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ తేడాను విద్యార్థినులు స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ్జి శివ నాయక్ మాట్లాడుతూ.. బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను అరికట్టేందుకు 2012లో పోక్సో చట్టం వచ్చిందని గుర్తుచేశారు. ఈ చట్టం ద్వారా నేరం నిరూపితమైతే కఠిన శిక్షలుంటాయని, కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని వివరించారు. పాఠశాల హెడ్ మాస్టర్ రమాదేవి, ఉపాధ్యాయ బృందం, పట్టణ ఎస్సై నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు, వైద్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>