శమీ పూజ నిర్వహించిన మంత్రి పొన్నం

​కలం, కరీంనగర్ బ్యూరో: విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన పొన్నం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.

అనంతరం విజయదశమి పండుగను పురస్కరించుకుని తన కాన్వాయ్‌లోని వాహనాలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి సంప్రదాయబద్ధంగా శమీ పూజ నిర్వహించారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం తన భద్రతా సిబ్బంది ఆయుధాలకు ఆయుధ పూజ నిర్వహించారు.

​అదేవిధంగా హుస్నాబాద్‌లోని ప్రాచీన శివాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో జరిగిన శమీ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. “విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అమ్మవారి దివ్య ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి., మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ప్రార్థించాను. ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని, ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>