కరీంనగర్ శిశుమందిర్‌లో ఘనంగా జమ్మి పూజ

కలం, కరీంనగర్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ (Karimnagar)లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో జమ్మి పూజ, వాహన పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా జమ్మి పూజ నిర్వహించడంతో పాటు, విద్యార్థుల రవాణా కోసం పాఠశాలలో వినియోగిస్తున్న 8 స్కూల్ వ్యాన్‌లకు వాహన పూజ నిర్వహించారు. విద్యార్థుల ప్రయాణాలు సురక్షితంగా సాగాలని, పాఠశాల అభివృద్ధి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ప్రధానాచార్యులు మోర రణధీర్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా. చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, చింతల కిషన్, బొడ్ల శ్రీనివాస్, కొత్తూరి ముకుందం, రాపర్తి శ్రీనివాస్, తాటి రాజేశ్వర్ రావు, డా. పోరండ్ల కిషన్, అప్పిడి వకుళాదేవి, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు పాఠశాల ఆచార్యులు, మాతాజీలు, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>