కలం, కరీంనగర్: ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త పీటీ స్వామి (PT Swamy) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో పీటీ స్వామి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీరని లోటు అని తెలిపారు. పీటీ స్వామి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, పీటీ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

