కలం, వెబ్ డెస్క్: బీహార్ (Bihar) రాష్ట్రం సివాన్లో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు అయిదుగురు సజీవ దహనం అయినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతు అయిందని వివరించారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలు ఛిద్రం కాగా.. క్రాకర్స్ తయారు చేస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మియాన్ అమీరుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు రెండు గంటల పాటు బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. సివాన్ పట్టణం బాణసంచా తయారీకి ఎంతో పేరొందింది. అయితే ఇక్కడ ప్రతి ఏడాది జరుగుతున్న ఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా ఘటనలో అయిదుగురు కార్మికులు సజీవ దహనం కావడం మరోసారి అక్కడి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై సీఎం సామ్రాట్ చౌదరి విచారణకు ఆదేశించారు.
Also Read : 2028 నాటికి ‘మేడ్ ఇన్ ఇండియా’ మొబైల్!
Follow Us On: Instagram

