కలం, వెబ్ డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ (Guttikonda) గ్రామంలో మొసలి కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఒక భారీ మొసలి హఠాత్తుగా జనావాసాల మధ్యలోకి వచ్చి, ఓ ఇంట్లోకి చొరబడింది (Crocodile Enters House). గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి మొసలి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాణభయంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు, గ్రామస్తుల సహాయంతో మొసలిని సురక్షితంగా పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

