ఇచ్చాపురంలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన ప్లాస్టిక్ గోదాం!

కలం, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం (Ichchapuram) పట్టణంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానిక దాసన్నపేటలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న రామకృష్ణ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో అన్నీ ప్లాస్టిక్ సామాగ్రి కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు తీవ్రస్థాయికి చేరి, గోదాం అంతటా వ్యాపించాయి.

ప్లాస్టిక్ గోదాంతో పాటు పక్కనే ఉన్న మేఘన లేడీస్ కార్నర్ షాపుకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గోదాం, షాపులోని సరుకు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు షాపు యజమాని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>