కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పోలీస్ స్టేషన్ (Maripeda Police Station) లో పైకప్పు సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏఎస్సై శ్రీనివాస రెడ్డికి గాయాలయ్యాయి. సోమవారం ఏఎస్సై విధుల నిర్వహిస్తున్న క్రమంలో సీలింగ్ పెచ్చులు ఊడిపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎస్సై భుజానికి గాయం అవడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

