ముంబయిలో మెట్రో నిర్మాణ స్థలంలో భారీ ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో నిర్మాణ (BKC Metro Construction) స్థలంలో బుధవారం భారీ ప్రమాదం జరిగింది. పిల్లర్‌పైకి భారీ బీమ్‌ను క్రేన్ సాయంతో ఎత్తుతుండగా ఆ బీమ్ కిందపడింది. ఈ క్రమంలో బీమ్‌ను మోస్తున్న మొబైల్ క్రేన్ కూడా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. నిర్మాణ పనుల్లో భద్రతా లోపాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుండగా, ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>