పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిర్మల్ ఎస్పీ

కలం, నిర్మల్‌ : నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను (Janaki Sharmila) మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (Madiga Employees Federation) నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలమొక్క అందించి శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎస్పీ తెలిపారు. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా చూడాలని, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు గాజుల రవికుమార్‌, ఎంఈఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మర్రెన్న, రాజేశ్వర్‌, కోశాధికారి చంద్రయ్య, సభ్యులు పోశెట్టి, మాణిక్యం, లింగన్న, ముత్యం, గంగాధర్‌, రాజ్‌కుమార్‌, కరుణాకర్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>