కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్, జెడ్పిటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నట్లు ఈసీ తెలిపారు. ఈనెల 28న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి.. 30న ఫలితాలు విడుదల చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 18 వరకు గడువు ఉందని తెలిపారు.19న నామినేషన్ పరిశీలించగా.. ఉపసంహరణకు ఈ నెల 21వరకు గడువు ఇచ్చారు.
ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు నవంబర్ 3న జరుగనున్నాయి. 5వ తారీఖున ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 19న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 23 వరకు గడువు ఇచ్చారు. 27వ తేదీ వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు.
ఇక మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను(Local Body Elections) ఈసీ నిర్వహించనుంది. నవంబర్ 26న తొలిదశ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 29న రెండోదశ పంచాయతీ ఎన్నికలు, డిసెంబర్ 2న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read : రష్మిక గొప్ప మనసు.. 400 కుటుంబాలకు సాయం!
Follow Us On: Youtube

