మాడ్రిడ్ ఓపెన్.. జాన్నిక్ సిన్నర్ ఘనవిజయం

కలం, వెబ్‌డెస్క్: మాడ్రిడ్ ఓపెన్‌ (Madrid Open) లో జాన్నిక్ సిన్నర్ (Jannik Sinner) తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. తాజాగా డెన్మార్క్ ప్లేయర్ ఎల్మర్ మోల్లర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు అమెరికా స్టార్ కోకో గాఫ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, కోర్టులో వీరోచిత పోరాటం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో డెన్మార్క్ క్రీడాకారుడు ఎల్మర్ మోల్లర్‌ను 6-2, 6-3 తేడాతో ఓడించారు. ఈ విజయంతో సిన్నర్ వరుసగా 19 మ్యాచ్‌ల్లో గెలిచినట్లయింది. మాస్టర్స్ 1000 విజయాల పరంపరలో ఇది ఆయనకు వరుసగా 24వ విజయం కావడం విశేషం. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమైన సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ సర్వీస్‌పై దృష్టి పెట్టడమే తన విజయ రహస్యమని పేర్కొన్నారు. తదుపరి రౌండ్‌లో ఆయన కామెరాన్ నోరీతో తలపడనున్నారు.

మహిళల విభాగంలో కోకో గాఫ్ అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించారు. ప్రస్తుతం మాడ్రిడ్ ఓపెన్ (Madrid Open) బరిలో ఉన్న చాలా మంది క్రీడాకారులను వేధిస్తున్న ఉదర సంబంధిత వైరస్ బారిన గాఫ్ కూడా పడ్డారు. మ్యాచ్ మధ్యలో ఆమె కోర్టులోనే వాంతి చేసుకున్నప్పటికీ ఆటను వదల్లేదు. సోరానా క్రిస్టియాపై 4-6, 7-5, 6-1 తేడాతో విజయం సాధించారు. మ్యాచ్ ముగించాలనే పట్టుదలే తనను గెలిపించిందని, ఇండియన్ వెల్స్ తరహాలో ఈసారి టోర్నీ నుండి తప్పుకోవడం ఇష్టం లేకనే పోరాడానని ఆమె తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>