కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి మండలం గంగన్పల్లి (Ganganpally) గ్రామానికి చెందిన కుర్వ పెద్దప్ప కర్రెప్ప (30) అనే రైతు అనుమానస్పదంగా మృతి చెందాడు. బుధవారం ఉదయం మైలగడ్డ స్టేజ్ సమీపంలో గల తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. పొలంలో ఎవరు లేని సమయంలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

