మోనాకో రేస్‌లో సత్తా చాటిన లూయిస్ హామిల్టన్

కలం, స్పోర్ట్స్: రేసింగ్ స్టార్ లూయిస్ హామిల్టన్ (Lewis Hamilton) మోనాకో గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం సృష్టించారు. రేసులో రెండో స్థానాన్ని దక్కించుకున్న ఆయన, ఆనందం పట్టలేక ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్‌ను ముద్దు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత నెల కెనడియన్ రేస్‌కు ముందే హామిల్టన్ తన రిటైర్మెంట్‌పై స్పష్టత ఇచ్చారు. ఫెరారీ టీమ్‌తో తన ఒప్పందం 2027 వరకు ఉందని, రాబోయే ఐదేళ్లూ రేసింగ్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ నమ్మకంతోనే ఆదివారం జరిగిన మోనాకో రేసులో అద్భుతంగా రాణించి సీజన్ బెస్ట్ స్కోర్ సాధించారు.

ప్రధాన ఆకర్షణగా కిమ్ కర్దాషియాన్‌..

ఈ రేస్‌లో కిమ్ కర్దాషియాన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫెరారీ హెడ్‌ఫోన్లు పెట్టుకుని హామిల్టన్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించింది. గతంలో హామిల్టన్‌తో కలిసి పలు ఈవెంట్లలో కనిపించినా, తమ బంధాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈసారి రేస్ ముగిసిన వెంటనే హామిల్టన్ నేరుగా కిమ్ దగ్గరకు వెళ్లి, హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమెను సెలబ్రేషన్స్ వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హామిల్టన్ మాట్లాడుతూ.. కిమ్ రేసు‌కి వచ్చి తనకు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన చుట్టూ మంచి వ్యక్తులు ఉండడం గొప్ప అనుభూతిని ఇస్తుందని, కిమ్ ప్రతిరోజూ తనకు ఆ సపోర్ట్ అందిస్తుందని చెప్పారు. మొత్తానికి ట్రాక్‌పై హామిల్టన్ విజయం, ట్రాక్ వెలుపల కిమ్‌తో ఆయన కెమిస్ట్రీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>