కలం, జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ (Lakshmipur) గ్రామానికి చెందిన నాలవాల నరేశ్ ప్రమాదానికి గురికావడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.
ప్రస్తుతం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదం కారణంగా ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చులు మరింత భారంగా మరాయి. కుటుంబ సభ్యులు సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నా.. చికిత్స ఖర్చులను భరించడం కష్టంగా మారడంతో దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నారు.
దాతలు ముందుకొచ్చి..
ఆపదలో ఉన్న నరేశ్‌ను ఆదుకునేందుకు దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు, మానవతావాదులు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తోచినంత ఆర్థిక సహాయం అందిస్తే నరేశ్ చికిత్సకు కొంతమేర ఊరట లభిస్తుందని గ్రామస్థులు కోరుతున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వేడుకుంటున్నారు.

