కలం, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ -17 క్రికెట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్లో నిర్మల్ (Nirmal) జిల్లా జట్టు విజయం సాధించింది. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్లోని నిర్మల్ క్రికెట్ అకాడమీ మైదానంలో శనివారం నిర్వహించిన పోటీల్లో నిర్మల్ జట్టు మూడు జిల్లాల జట్లపై గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నిర్మల్ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అండర్ -17 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు గద్వాల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో నిర్మల్ (Nirmal) జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు వెళ్లనుండటంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలకు సుదర్శన్ కోచ్గా వ్యవహరించగా, కార్యదర్శి లక్ష్మణ్, ఎం. శ్రీనివాస్, రమణారావు, రమణ, బుచ్చి రామారావు, వన్నెల భూమన్న, రాష్ట్రపాల్ సాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

